సరుకులు కొనడానికి కిరాణా స్టోర్‌కి వెళ్లే టైమ్ కూడా లేదా? అయితే ఇది బెస్ట్ సొల్యూషన్
Posted in Computers
No comments:
Saturday, October 5, 2013
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=bNrA_xWC8NM
ఇంటి, ఆఫీస్ పనులతో బిజీ బిజీగా ఉండే వాళ్లు పనిగట్టుకుని మరీ కిరాణా షాప్‌కి వెళ్లి సరుకులు కొనుక్కోవడం కష్టంగా ఉంటుంది.
కొన్ని కిరాణా షాపుల వాళ్లు ఫోన్‌లో ఆర్డర్ తీసుకుని హోమ్ డెలివరీ ఇస్తున్నా ఆయా సరుకుల క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలీదు. తీరా ఆర్డర్ ఇచ్చి వస్తువులు వచ్చాక చీప్ క్వాలిటీతో ఉన్నాయని బాధపడుతుంటాం.
ఇలాంటి సమస్యలు అన్నింటికీ ఓ మంచి పరిష్కారాన్ని ఈ వీడియోలో చూపించాను. ఇందులో చూపించిన ఆన్‌లైన్ సూపర్ మార్కెట్లో బియ్యం దగ్గర్నుండీ, కూరగాయలూ, పళ్లూ, పేస్ట్, షాంపూల వంటి అన్ని వస్తువుల క్వాలిటీని ఫొటోల్లో చూసి ఆర్డర్ చేసి నేరుగా ఇంటికి తెప్పించుకోవచ్చు.
బయట షాపుల్లో ఉన్న ధరల కన్నా కొద్దిగా చవక ధరలు కూడా పొందొచ్చు.
గమనిక: టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవితాన్ని సులభతరం చేసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=bNrA_xWC8NM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
Related posts
Share this post




0 comments: