మీ వైఫై కనెక్షన్ ఇతరులకు తక్కువ స్పీడ్ వచ్చేలా సెట్ చేసుకోవాలా? ...Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=6WRKM1XjdDE
మామూలుగా మన WiFi రూటర్‌కి కనెక్ట్ అయ్యే ప్రతీ ఒక్కరికీ ఒకటే స్పీడ్ లభిస్తుంటుంది. దీంతో మీ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ గానీ, మీరు ఎవరికైనా వై-ఫై యాక్సెస్ ఇస్తే వారు గానీ తెలిసీ తెలియక ఎక్కువ బ్యాండ్‌విడ్త్ వినియోగించుకోవడమూ, దానితో మీ నెట్ లిమిట్ దాటిపోవడమూ జరుగుతుంది.
ఇంత ఇబ్బంది లేకుండా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయినే ఒక ఫోన్‌కైనా, పిసికైనా, లాప్‌టాప్‌కైనా మీరు ఎంత స్పీడ్ సెట్ చేస్తే కేవలం అంత స్పీడ్‌కి మించి వారికి నెట్ పనిచెయ్యకుండా లిమిట్ చేసుకోవచ్చు. లిమిటెడ్ నెట్ కనెక్షన్ ఉన్నప్పుడూ, మీకు వచ్చే స్పీడ్ మొత్తం ఇతరులకు వెళ్లిపోయి మీకు స్లోగా నెట్ పనిచేస్తున్నప్పుడూ, fair usage policies మీ ప్యాకేజ్‌కి ఉన్నప్పుడూ మీ లిమిట్ దాటకుండా ఇది బాగా పనికొస్తుంది. సో ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=6WRKM1XjdDE
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
Related posts
Share this post




0 comments: